బుజ్జాయి జననం…..

పల్లెటూరిలో పుట్టిన ప్రతి ఒక్కరికి సాటి మనుషులతోనే కాకుండా ప్రకృతితో, పశువులతో, పక్షులతొ, పెంపుడు జంతువులతో చక్కని అనుబంధం ఉంటుంది. ఒక మొక్క పెట్టి చిగురిస్తున్నప్పుడుగాని, ఒక గింజ నాటి మొలక వచ్చినప్పుడు, చిగురు వెసినప్పుడు, కొత్తగా పూవు పూసినపుడు, కాయ కాసినపుడు, అది పండై నిగనిగలాడుతూ చెట్టుకు వేలాడుతున్నపుడు చూసి స్పందించని పిల్లవ్వడు గాని, పెద్దలుగాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక కోడి పిల్ల గుడ్డులోంచి బయటికి వచ్చినప్పుడు, ఒక పిచ్చుక పిల్ల గూడు లోంచి తొంగి చూసినప్పుదు, పెంపుడు కుక్క ఈనినప్పుడు పుట్టిన బుజ్జి బుజ్జి పిల్లల్ని చూసినప్పుడు, నిన్నటివరకూ పాలిచ్చి చూడిమోసి రేపోమాపో ఈనడానికి సిద్దంగా ఉన్న ఆవునో, గేదెనో చూసినప్పుడు ఏదో అవ్యక్తమైన ఆనందాన్ని పొందని హ్రుదయం ఒకప్పుడు ఉండేది కాదంటే ఈతరం పిల్లలు, పెద్దలు నమ్మరేమో. పిచ్చుక పిల్లలకు, కోడి పిల్లలకు నూకలు ఆహారంగా పెట్టడం, కుక్క పిల్లల్ని ఎత్తుకుని, లాలించి వాటికి తల్లిదగ్గర పాలు త్రాగించి ఆనందించడం ప్రతి పల్లెటూరి పిల్లవానికి అనుభవమే. గేదో, ఆవో ఈనుతుంటే అందరూ దగ్గరచేరి ఎప్పుడు ఈనుతుందా అని ఎదురు చూడడం, పెయ్యిదూడొ, దున్న పిల్లో, కొడె దూడో అని, అది ఎలా ఉంటుందొ అంటే రంగు ఎలాఉంటుందో, వంటిమీద చుక్కలుంటవా, సుడులుంటవా  అనుకుంటూ కాలక్షేపం చేస్తూ దాని పుట్టుక కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ సమయం రాగానే దూడను ముందుగ ముక్కులు పిండుతారు. (అంటే ముక్కులోనున్న తెమడనంతా శుభ్రం చేస్తారు.) తరువాత గోళ్ళు గిల్లి (అవి మెత్తగా ఉంటాయి) తల్లికి తినిపిస్తారు. ఒంటికున్న తడినంతా తల్లి నాలుకతొ శుభ్రం చేస్తుంది. తరువాత బొడ్డుకు గుడ్డ కట్టి కాకులు పొడవకుండా చూస్తారు. ఫుట్టిన కాసేపటికే ఆ దూడ (ముద్దుగా బుజ్జాయి అని పిలుస్తారు) లేవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే క్రింద పడిపోతుంటుంది. అయినా లేవడానికి ప్రయత్నం మాత్రం మానదు. ఈ లోపు బుజ్జాయి నోట్లో వేలుపెట్టి చీకిస్తారు (రొమ్ముపట్టి పాలు త్రాగడం అలవాటు చేయడానికి). కాసేపాగి తల్లి పొదుగువద్దకు తీసుకెళ్ళి పాలు కుడిపించే ప్రయత్నం చేస్తారు.
ఇదంత ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ మధ్య ఒక రోజు మాసొంత ఊరు ముళ్ళపూడి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల తరువాత బుజ్జాయి పుట్టినపుడు చూసి దాని చేష్టలను వివిధ దశలలో ఫొటొలను తీయడం జరిగింది. వాటిని వరుసగా సమయంతో సహా ఇస్తున్నాను.

p2121947_web.jpg

 p2121948_web.jpg

p2121950_web.jpg

 p2121952_web.jpg

చివరిఫొటోలో దాన్ని తాడుతో కాలును కట్టివేయడం చూడవచ్చు. ఎందుకు కట్టివేసారో తెలుసా!!!!  ఆ బుజ్జాయి…….. చుట్టూచేరిన మగ పిల్లల వెనుక పాలు త్రాగడానికి వెంటపడి వెంటపడి నోరుతెరిచి కుమ్మడం మొదలుపెట్టింది గనుక. అంతటి తుంటరిదా బుజ్జాయి కనుకనే, ఆ సంఘటన నేను మరువలేదు కావుననే మీతో పంచుకుంటున్నాను.

3 స్పందనలు to “బుజ్జాయి జననం…..”

  1. teresa అన్నారు:

    చాలా బాగా రాశారు. చిన్నప్పుడు అమ్మమ్మగారి పల్లెలో పెరిగిన రొజుల్నించి తియ్యటి గుర్తుల్ని వెలికి తెచ్చారు!

  2. డా.పి.మురళీ కృష్ణ. అన్నారు:

  3. vani అన్నారు:

    this is the first time i have seen atleast photoes of a new born cute little.
    i am excited to see how an animal tries to stand up inspite of falls , unlike we humans give up after one or two failures. so there is some thing to learn from this episode.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.