కుందేలు తెలివి

చిన్నప్పుడు పంచతంత్ర కథలు చదివేటప్పుడు జంతువుల తెలివితేటలగూర్చి అంతగాఅవగాహన లేకపోయినా జీవితంలో చూసిన సంఘటనలు ఔరా అవినిజంగానే జరిగినవా అనిపిస్తుంటాయి. కాని జీవితంలో ఎదురయ్యే సంఘటనలు మాత్రం అవి మాట్లాడలేకపోయినా తెలివితేటలను ప్రదర్శించడం మనం అనేకరకాలుగా చూస్తూనే ఉన్నాము. అందరూ కాకపోయినా కొందరయినా చూసే సంఘటనలను చెప్పుకోవాలంటే పశువులేవైనా చనిపోతే తోటి పశువులు ఏడవడమే కాకుండా కన్నీరుపెడ్తూ తాళ్ళుతెంపుకుని దానితోబాటే వెళ్ళాలని ప్రయత్నం చేస్తాయి. ఏదైనా పిచ్చుక చనిపోతే తోటి పిచ్చుకలు వాగులొ స్నానం చేయడం నేను కళ్ళారా అనేక సార్లు చూసాను. వాటికి దెబ్బతగిలినపుడు మిగిలిన జంతువులు నాలుకతో నాకి స్వాంతన కలిగిస్తాయి. సరే నేర పరిశొధనలో కుక్కల తెలివితేటల గూర్చి చెప్పుకోనవసరం లేదనుకుంటా. ఇవన్నీ ఒక ఎత్తైతే నేను చూసిన ఒక సంఘటన ఇప్పటికీ నా స్మృతి పధంలో మెదులుతూనే ఉంది.
ఓక రోజు తెల్లవారుఝామునే లేచి ఆపరేషన్ చేయడానికి అమరావతి కైనెటిక్ హోండాపై బయలుదేరాను. ఒక నాలుగున్నర కిలోమీటర్లు ప్రయాణం చేసాక రోడ్డు ప్రక్కన పొదలలోనుండి ఒక పెద్ద కుందేలు ఒక్కసారిగా చెంగున దూకి స్కూటరుపై పడి రహదారిపై  పడిపోయింది. ఆ దెబ్బతో నా మనసంతా వికలమైపోయి హఠాత్తుగా బ్రేక్ వేసి ఆగాను. అచ్చట చూద్దునుగదా ఒక గోధుమ రంగు కుందేలు రహదారిపై పడి గిలగిలా నాలుగు కాళ్ళు తన్నుకుంటూ ఉంది. దాన్ని చూసి నా మనసు చాలా బాధపడి ఏమి చేయాలో పాలుపోక మనసు పరిపరివిధాల ఆలోచింపసాగింది. దానికి వైద్యం చేయించాలా, బ్రతుకుతుందా లేదా, ప్రొద్దున్నే ఇదేమి బాధరా బాబూ అనుకుంటూ దాన్ని రహదారి మధ్యనుండి తీసి ప్రక్కనన్నా పడుకోపెడదాం, లేకపోతే మరలా ఏదో ఒక బండి దానిమీదగాపోయి చంపుతుందనిపించింది. దాని నాల్గుకాళ్ళు పట్టుకొని ప్రక్కన పరుండబెట్టటానికి ప్రయత్నం చేస్తే నన్ను పట్టుకోనివ్వకుండా చాలావేగంగా కాళ్ళను కొట్టుకోసాగిండి. ఎలాగో తంటాలుపడి కాళ్ళు పట్టుకొని ప్రక్క పొదలలొ మెత్తని చోటు చూసి పడుకోబెట్టడం జరిగింది. మనసులో ఎంతో బాధతో అచ్చటినుండి వెళ్ళడానికి వెనుతిరిగి స్కూటరువద్దకు వెళ్ళానోలేదో ఆ టక్కరి కుందేలు ఒక్కసారిగా లేచి ఎంతో వేగంగా తుప్పల్లోకి పరుగోపరుగు. నానుండి తప్పించుకోవడానికి ఆ అల్పజీవి ఎంతతెలివిగా నన్ను మోసం చేసిందో ఇప్పటికీ నాకాదృశ్యం కనులముందు కనబడ్తూనే ఉంటుంది.
అదండీ మా తెలివిగల కుందేటి కధ.

5 స్పందనలు to “కుందేలు తెలివి”

  1. నవీన్ గార్ల అన్నారు:

    డాక్టరు గారు..మీ బ్లాగు ఆరోగ్యం అంతగా బాగోలేదు. అక్షరాలు బాగా పెద్దవయ్యాయి…సైజు తగ్గించాలి :)

  2. drpvsnp అన్నారు:

    సంతోషం నవీన్. ముందుగా లేఖినిలో వ్రాసి వర్డ్‌లో దాచియుంచినపుడు అంతకుముందున్న హెడ్డింగ్ ఫాంట్‌సైజు కొనసాగింది. అందువల్లనే అది అలా అయ్యింది. సరిచేస్తాను.

  3. డా.పి.మురళీ కృష్ణ. అన్నారు:

    ఒక వైద్యునిగా ప్రాణం విలువ తెలిసిన మీరు ఆ చిరుజీవి విషయంలో సరిగానే స్పందించారు.వేరెవరైనా అయితే భలే ఛాన్సులే అనుకుంటూ ఇంటికి తీస్కెళ్ళి కూరొండుకునేవాళ్ళేమో!

  4. drpvsnp అన్నారు:

    నిజమేనండీ! ఎవరో ఎందుకు…ఇంటికివచ్చి విషయం చెప్పినపుడు ఎదుటివారి కష్టాలను తనకష్టాలుగా కన్నీరు కార్చే మా చిన్న అమ్మాయి కీ.శే.నీలిమా నాయుడు పెద్దగా ఏమందో తెలుసాండీ: “నాన్నా ఇంటికి తీసుకు వస్తే కోసుకుతినేవాళ్ళం కదా ” అన్నప్పుడు నా నోట మాట రాలేదు. ఆపిల్ల జీవిత కాలంలో కసాయిగా మాట్లాడిన ఒకేఒక్క వాక్యం అదే.

  5. nidalu అన్నారు:

    నిజమేనండి, జంతువుల తెలివితేటలు చూసి ఆశ్చర్యపడతాం, ఒకొక్కపుడు వాటిని చూసైనా నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. నిన్న నేను కారులో వెళ్తుంటే, మూడు నిప్పుకోళ్లు రోడ్డుదాటుతు నాకు అడ్డం వచ్చాయి. సరే కారు ఆపాను. ఎదురునించి వస్తున్న కారు కూడా ఆగింది. రెండుకోళ్లు సగం దూరం వచ్చి వెనక్కి చూసాయి. కాని, మూడో కోడి చిన్నది రోడ్డువారనే నిలబడిపోయింది. అప్పుడు ఈరెండు కోళ్లూ కూడా వెనుదిరిగి వెనక్కి వెళ్లి పోయాయి.
    నాకు ఆశ్చర్యం ఆకోళ్లకి అంత ట్రాఫిక్ రూల్స్ జ్ఞానం వున్నందుకు.
    మీకథ అంత రసవత్తరం కాకపోయినా నాకు తమాషా గా అనిపించింది.
    నీనీ

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.